Anushka Shetty: తలవంచి తాళి కట్టించుకునేది అతనితోనే... ఎవరో మాత్రం ఇంకా తెలియదు: అనుష్క

Anuska Arranged Marriage
  • అనుష్కపై పలు రకాల వదంతులు
  • పెళ్లి విషయంలో తల్లిదండ్రులదే తుది నిర్ణయం
  • ఎవరిని చూపిస్తే వారినే చేసుకుంటానన్న అనుష్క
2005లో తెరంగేట్రం చేసి, అనతికాలంలోనే అగ్రహీరోయిన్ గా ఎదిగిన అనుష్క, వివాదాల్లోనూ అంతే పేరు తెచ్చుకుంది. ప్రభాస్ తో ప్రేమలో ఉందని కొన్నాళ్లు, ఓ వ్యాపారవేత్తతో డేటింగ్ చేస్తోందని మరికొంతకాలం, ఆపై ఇప్పుడు క్రికెటర్ తో లవ్ లో ఉన్నదని వదంతులు వస్తూనే ఉన్నాయి. తాజాగా, తనపై వస్తున్న వార్తలపై స్పందించిన స్వీటీ, అన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చింది. తన గురించి ఇలాంటి వదంతులు ఎందుకు పుట్టిస్తున్నారో తెలియడం లేదని వాపోయింది.

తనకు పెళ్లంటూ జరిగితే, పెద్దలు కుదిర్చిన సంబంధాన్నే చేసుకుంటానని స్పష్టం చేసింది. తన తల్లిదండ్రులు ఎవరిని చూపిస్తారో, వారి ముందు తల వంచుకుని కూర్చుని తాళి కట్టించుకుంటానని చెబుతోందీ బెంగళూరు భామ. పెళ్లిపై పేరెంట్స్ దే తుది నిర్ణయమని, అందులో సందేహం లేదని అంటోంది. అయితే, అతను ఎవరన్న విషయం మాత్రం తనకు తెలియదని అంది. ఇక ఇప్పటికైనా అనుష్కపై అసత్య ప్రచారం ఆగుతుందో.. లేదో వేచి చూడాలి.

Anushka Shetty
Marriage
Arranged Marriage

More Telugu News