హీరోయిన్‌ రష్మిక ఫొటోకు 'చించావ్ లే పో' అంటూ కామెంట్ చేసిన వ్యక్తి అరెస్టు

police arrests srinivas
షార్ట్స్‌లో చూడండి
సినీ నటి రష్మిక మందన్న ట్విట్టర్‌లో పెట్టిన ఫొటోలకు 'చించావ్ లే పో' అంటూ  కామెంట్ చేసి అలజడి రేపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జగిత్యాల కలెక్టర్ గుగులోతు రవి ట్విట్టర్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన అతడు ఈ విధంగా కామెంట్ పెట్టిన విషయం తెలిసిందే. కలెక్టర్ ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన వ్యక్తి పేరు గంగాధర శ్రీనివాస్‌ అని, నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

2018లో కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్‌ను శ్రీనివాస్ హ్యాక్ చేసి, అప్పటి నుంచి దాన్ని ఆపరేట్ చేస్తున్నాడని పోలీసులు వివరించారు. ఇటీవల సినీనటి రష్మిక మందన్న ఫొటోకు కామెంట్ చేశాడని తెలిపారు. నిందితుడు శ్రీనివాస్ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడని తెలిపారు. కాగా,  తాను ఆ కామెంట్ చేయలేదని కలెక్టర్ రవి ఇప్పటికే స్పష్టం చేశారు.
Go Back to Shorts
Hyderabad
Police
Jagtial District

More Telugu News