ఏఆర్ రెహమాన్ బహుముఖ ప్రజ్ఞ!
- రొమాంటిక్ మ్యూజికల్ గా తెరకెక్కుతున్న 99 సాంగ్స్
- 99 సాంగ్స్ చిత్రానికి నిర్మాతగా రెహమాన్
- ఈ సినిమాకు రచయితగానూ వ్యవహరిస్తున్న సంగీత దిగ్గజం
దీనిపై రెహమాన్ మాట్లాడుతూ, కొత్త బాధ్యతల్లో పనిచేయడం కొంచెం కష్టంగానే ఉందని తెలిపారు. ఇంతకుముందు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు అనుభవజ్ఞుడైన దర్శకుడు, నిర్మాత, పాటల రచయితతో ఆలోచనలు పంచుకునేవాడ్నని, ఇప్పుడు తానే రచయితనయ్యానని, తాను రాసేది నిర్మాతకు నచ్చాల్సి ఉంటుందని ఇదో కొత్త అనుభూతి అని పేర్కొన్నారు.