వివేకా హత్య కేసు: సిట్ విచారణ పూర్తవుతోంది, సీబీఐ దర్యాప్తు అవసరంలేదన్న ఏజీ
- వివేకా హత్యకేసు సీబీఐకి అప్పగించాలని పిటిషన్లు
- పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు
- కేసు డైరీ అప్పగించాలని ఏజీని ఆదేశించిన న్యాయస్థానం
- తదుపరి విచారణ సోమవారానికి వాయిదా
వివేకా హత్య కేసులో ఏర్పాటైన సిట్ విచారణ త్వరలోనే పూర్తికాబోతోందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరంలేదని అన్నారు. ఈ సందర్భంగా సిట్ విచారణ నివేదికను ఏజీ సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించారు. విచారణ తీరుతెన్నులను కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం లోగా కేసు డైరీ, ఇతర కీలక ఫైళ్లను తమకు అందించాలని ఏజీని న్యాయమూర్తి ఆదేశించారు.