Nayanatara: నయనతార నుంచి మరో హారర్ థ్రిల్లర్ .. రేపే రిలీజ్

Vasantha Kalam Movie
తెలుగు .. తమిళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. తమిళంలో ఆమె చేసిన సినిమాలు తెలుగులోనూ విడుదలవుతుంటాయి. ముఖ్యంగా ఆమె చేసిన హారర్ థ్రిల్లర్ సినిమాలు తెలుగులోను భారీ వసూళ్లను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళంలో ఆమె చేసిన 'కొలైయుత్తిర్ కాలం' క్రితం ఏడాది తమిళ ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో 'వసంతకాలం' పేరుతో విడుదల చేస్తున్నారు. చక్రి తోలేటి దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ ను, వీవీఎస్ శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఒక కీలకమైన పాత్రలో భూమిక నటించిన ఈ సినిమా, తెలుగులో రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దగా పబ్లిసిటీ లేని ఈ సినిమా ఎంతవరకూ రీచ్ అవుతుందో చూడాలి.
Nayanatara
Bhoomika
Vasantha Kalam Movie

More Telugu News