చంద్రబాబు ఉద్దేశం మాకెప్పుడో అర్థమైంది: సజ్జల రామకృష్ణారెడ్డి
- విజయవాడలో జర్నలిస్టు సమాఖ్య మీట్ ద ప్రెస్ కార్యక్రమం
- రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ వ్యాఖ్యలు
- జగన్ దీర్ఘకాలిక లక్ష్యాలతో పరిపాలిస్తున్నారన్న సజ్జల
చంద్రబాబు రూ.2.60 లక్షల కోట్లు అప్పుల భారం మోపారని, ఒక్క ఆదాయ వనరును కూడా సృష్టించలేకపోయారని విమర్శించారు. వ్యక్తిగత ఖజానా భర్తీ చేసుకోవడం కోసం ప్రజల్లో ఓ భ్రమ కల్పించారని, అమరావతిలో రాజధాని నిర్మించాలని చంద్రబాబుకు ఎలాంటి ఉద్దేశం లేదని అన్నారు. అయితే బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారని తమకు ఎప్పుడో అర్థమైందని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రతిపాదనల ప్రకారం ముందుకెళితే లక్ష కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, అంత మొత్తం ఒక్క చోటే ఖర్చు చేయడం ఎందుకుని జగన్ వికేంద్రీకరణ వైపు మొగ్గుచూపారని సజ్జల వివరించారు.