పాశుపత హోమం నిర్వహించిన అమరావతి రైతులు
- ఏపీ సీఎం జగన్ మనసు మారాలని కోరుతూ యాగం
- అమరావతి ఏకైక రాజధాని కావాలని డిమాండ్
- 64వ రోజుకు చేరిన ఆందోళన
ఇందులో భాగంగా ఈ రోజు నేలపాడులో మాన్యూ పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం నిర్వహిస్తున్నారు. అమరావతి మాత్రమే రాజధాని కావాలని ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేశారు. రాజధాని కోసం పెనుమాక, ఎర్రబాలెం, కిష్టాయపాలెం, రాయపూడి, నేలపాడు, పెదపరిమి, తాడికొండ అడ్డరోడ్డు, 14వ మైలు, మందడం, తుళ్లూరులో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.