దొంగలెత్తుకెళ్లిన అమ్మవారి హుండీని చూపించిన వీధి కుక్క... గుంటూరు జిల్లాలో ఘటన!
- నిదానంపాటి అమ్మవారి ఆలయంలో చోరీ
- హుండీని ఖాళీ చేసి, చెరువులో పడేసిన దొంగలు
- వారు వెళ్లిన మార్గాన్ని చూపించిన శునకం
నిత్యమూ గుడి వద్దే ఉంటూ భక్తులు పెట్టే ఆహారాన్ని తిని బతుకుతున్న ఓ వీధి కుక్క వీరిని గమనించింది. గుడికి వచ్చే ఓ వృద్ధురాలిని అప్రమత్తం చేసింది. దాని సైగలను చూసి, అదేదో చెప్పాలని భావిస్తోందని అనుకున్న ఆమె, దాని వెంట నడిచేసరికి, చెరువు వద్దకు తీసుకెళ్లింది. చెరువులో హుండీ కనిపించగా, దొంగతనం జరిగిందని ఆమె ఊరి పెద్దలకు చెప్పింది.
ఇక ఈ హుండీలో 50 వేల వరకూ నగదు, వెండి కానుకలు ఉండవచ్చని ఆలయ కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక ఈ శునకం చెరువు నుంచి డొంకరోడ్డు వైపు వెళుతూ మొరగడంతో దొంగలు అటువైపు వెళ్లి ఉంటారని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్టు తెలిపారు.