Samantha: హీరో కోసం పోటీపడే నాయికలుగా నయనతార, సమంత

  • విఘ్నేశ్ శివన్ నుంచి వినోదభరిత చిత్రం 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి 
  • త్వరలోనే మిగతా వివరాల వెల్లడి
Kathuvakula Rendu Kadhal Movie

తమిళనాట నయనతార .. సమంత ఇద్దరికి కూడా మంచి క్రేజ్ వుంది. అలాగే తెలుగులోను ఇద్దరికీ మంచి ఫాలోయింగ్ వుంది. అలాంటి ఈ ఇద్దరూ ఒకే తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కథానాయకుడిగా 'కాతు వాకుల రెండు కాదల్' సినిమా రూపొందనుంది.

పూర్తి వినోదభరితంగా సాగే ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళుతున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతుంది. కథానాయికలుగా సమంత - నయనతార కనిపించనున్నారు. హీరో కోసం పోటీపడే కథానాయికలుగా, ఆయన కోసం ఫైటింగులు గట్రా చేసుకునే నాయికలుగా ఈ సినిమాలో సమంత - నయనతార కనిపిస్తారట. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. మిగతా విషయాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News