తాను వెళ్లాలనుకున్న ప్రదేశానికే ఆటో వెళుతుందన్న డ్రైవర్... భయంతో దూకేసిన యువతి
- ముంబయిలో ఘటన
- పంచరత్న వెళ్లేందుకు ఆటో ఎక్కిన యువతి
- కీచకావతారం ఎత్తిన ఆటో డ్రైవర్
- ఆటోలోంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు
అతడి మనసులోని దురాలోచన అర్థమైన యువతి వణికిపోయింది. అంతలోనే అతడు ఆమె వెళ్లాల్సిన రూట్ కాకుండా మరో మార్గంలోకి ఆటోను మళ్లించాడు. దాంతో ఆ యువతి భయంతో దూకేసింది. ఈ క్రమంలో ఆమె తలకు గాయాలయ్యాయి. తల రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ కు బలంగా తాకింది. రోడ్డుపై వెళుతున్న వాళ్లు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ కీచకుడ్ని అదుపులోకి తీసుకున్నారు.