కేసుల మాఫీ కోసమా? దేని కోసం ఎన్డీయేలో చేరుతున్నారు?: బొత్సకు బుద్ధా వెంకన్న ప్రశ్న

15-02-2020 Sat 13:02
  • బొత్స చెప్పారంటే వైసీపీలో అది వేదవాక్కు
  • రాజధానిని తరలిస్తున్నట్టు తొలుత చెప్పింది బొత్సే
  • ఎన్టీయేలో వైసీపీ కలవబోతోందని ఇప్పుడు కూడా ఆయనే చెప్పారు
Why you are joining NDA question to Botsa by Budda Venkanna

బొత్స గారు చెప్పారంటే అది వైకాపాలో వేదవాక్కేనని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలిస్తున్నట్టు మొదట చెప్పింది బొత్స గారేనని...  ఇప్పుడు ఎన్డీయేలో వైసీపీ కలవబోతోందని బొత్స చెప్పారని తెలిపారు. అత్యధిక ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదాను సాధిస్తామన్న జగన్ గారు ఇప్పుడు కేంద్రం ముందు ఎందుకు మోకరిల్లారో బొత్స గారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.  

కేసుల మాఫీ కోసమా? బెయిల్ రద్దు అవ్వకుండా ఉండేందుకా? దేని కోసం ఎన్డీయే లో చేరుతున్నారు? ఈ ప్రశ్నలకు బొత్స సమాధానం చెప్పాలని బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు. తల వంచి, కాళ్లు పట్టుకొని ఎన్డీయేలో చేరి సాధించబోయేది ఏంటో బొత్స గారు వివరించాలని అన్నారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.