శ్రీనివాస్ నివాసంలో దొరికింది రూ.2 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే: దేవినేని ఉమ
- చంద్రబాబు మాజీ పీఎస్ నివాసంలో ఐటీ దాడులపై ఉమ స్పందన
- జగన్ అందరినీ అవినీతిలోకి లాగాలని చూస్తున్నారంటూ ధ్వజం
- దొంగే... దొంగ, దొంగ అన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని విమర్శలు
వచ్చే నెలలో శ్రీనివాస్ కుమార్తె వివాహం కూడా ఉందని తెలిపారు. వైసీపీ నేతలు మాట్లాడడం చూస్తే, దొంగే... దొంగ, దొంగ అన్నట్టుగా ఉందని విమర్శించారు. మంత్రులు, ఎంపీలపై ఐటీ దాడులు జరగకుండా ఉండేందుకే జగన్ ఢిల్లీ పర్యటన అని దేవినేని ఉమ ఆరోపించారు. ఐటీ దాడుల నుంచి తన వారిని రక్షించుకునేందుకే జగన్ ఢిల్లీ పరిగెత్తారని ఎద్దేవా చేశారు.