తన భర్త కనిపించడం లేదంటున్న హార్దిక్ పటేల్ భార్య!
- 20 రోజుల నుంచి నా భర్త కనిపించడం లేదు
- గుజరాత్ పాలకులు నా భర్తను టార్గెట్ చేశారు
- ప్రజా సమస్యలపై స్పందించకుండా అడ్డుకుంటున్నారు
గుజరాత్ లో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, తన భర్తను జైలుకు పంపేందుకు యత్నిస్తున్నారని కింజాల్ పటేల్ చెప్పారు. తనను అరెస్ట్ చేసేందుకు అహ్మదాబాద్ పోలీసులు తన ఇంటికి వచ్చారని... ఆ సమయంలో తాను ఇంట్లో లేనని హార్దిక్ పటేల్ కొన్ని రోజుల క్రితం ఓ ట్వీట్ చేశారు. ముందస్తు బెయిల్ కోసం తాను హైకోర్టులో పిటిషన్ వేశానని తెలిపారు.