పెళ్లికి ముందు కలిసి తిరిగినా తప్పు లేదంటున్న కైరా అద్వానీ

13-02-2020 Thu 16:22
  • పెళ్లికి ముందు డేటింగ్ చేయడంలో తప్పు లేదు
  • ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది
  • ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చు
Nothing wrong in dating says Kiara Advani

సినిమా హీరోయిన్లు బోల్డ్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. తాజాగా ఈ జాబితాలో 'భరత్ అనే నేను' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ కూడా చేరింది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ అమ్మడు... పెళ్లికి ముందు డేటింగ్ చేసినా ఎలాంటి తప్పు లేదు అంటూ సంచలన ప్రకటన చేసింది. పెళ్లికి ముందు కలిసి తిరగడంలో తప్పు లేదని... ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇది తోడ్పడుతుందని, ఒకరిని విడిచి మరొకరం ఉండలేమనే నిర్ణయానికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. అయితే, తాను మాత్రం ఎలాంటి రిలేషన్ షిప్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని సెలవిచ్చింది.