Riverse Tendering: ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో రివర్స్ టెండరింగా?: నారా లోకేశ్

Riverse Tendering In Employees Salaries Questioned Nara Lokesh
  • తీసుకున్న జీతాలను తిరిగి చెల్లించాలనడం దారుణం
  • సంక్షేమ కార్యక్రమాల్లోనూ రివర్స్ టెండరింగ్ పెట్టారు
  • పెన్షన్లు,రేషన్  కార్డుల్లో కోత పెట్టారు

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలతో మరోసారి విరుచుకుపడ్డారు. 'ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కూడా రివర్స్ టెండరింగా? సిగ్గుగా లేదా? టీడీపీ హయాంలో మహిళా,శిశు సంక్షేమ శాఖ కాంట్రాక్టు ఉద్యోగులకు స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.7 వేల వరకు జీతాలు పెంచారు. ఇప్పుడు పెంచిన జీతాన్ని వైసీపీ ప్రభుత్వం తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి అనడం దారుణం. మీ నవ్వు వరం అని మీ నాయకులు డప్పు కొడుతున్నారు. కానీ మీ నవ్వు ప్రజలకు శాపంగా మారుతోంది జగన్ గారు. సంక్షేమ కార్యక్రమంలో రివర్స్ టెండరింగ్ పెట్టి పెన్షన్లు, రేషన్ కార్డుల్లో కోత పెట్టారు. అమ్మ ఒడి డబ్బులు వెనక్కి లాగేసారు’ అంటూ మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News