ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యం.. పార్టీ ఇన్ ఛార్జ్ పీసీ చాకో రాజీనామా
- ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి మాజీ సీఎం షీలా దీక్షిత్ కారణమంటూ వ్యాఖ్య
- కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ సొంతం చేసుకుంది
- చాకో వ్యాఖ్యలను ఖండించిన మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర
ఈ సందర్భంగా చాకో మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో కాంగ్రెస్ పతనానికి కారణం మాజీ సీఎం షీలా దీక్షిత్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 2013లో షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పతనం ప్రారంభమైందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఆప్ సొంతం చేసుకుందన్నారు. కోల్పోయిన ఓటు బ్యాంకును కాంగ్రెస్ తిరిగి సాధించలేకపోయిందన్నారు.
కాగా, చాకో వ్యాఖ్యలతో మహారాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర విభేదిస్తూ.. ఢిల్లీలో షీలా అధికారంలో ఉండగా కాంగ్రెస్ ప్రకాశించిందన్నారు. షీలా మరణానంతరం ఆమెపై వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. షీలా పార్టీకి, ఢిల్లీ ప్రజలకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.