ఢిల్లీలో ‘ఆప్’ సంపూర్ణ విజయం.. మూడోసారి అధికారంలోకి!
- మొత్తం 70 సీట్లలో 62 స్థానాల్లో ఆప్ విజయం
- 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ
- కాంగ్రెస్ కు ఘోర పరాజయం
కాగా, ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈరోజుతో ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ముగియడంతో శాసనసభను లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేశారు. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ‘ఆప్’ ను మరోమారు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించనున్నారు. ఈ నెల 14న ఢిల్లీ సీఎం గా కేజ్రీవాల్ మరోమారు ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది.