ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఖండిస్తున్నాం: కన్నా లక్ష్మీనారాయణ

  • ఏపీ రివర్స్ గేర్ లో వెళుతోంది
  • మధ్య తరగతి వారిపై పెనుభారం పడుతుంది
  • వైసీపీ సర్కార్ ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోంది
ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచడంపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఏపీ రివర్స్ గేర్ లో వెళుతోందని విమర్శిస్తూ ఓ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మధ్య తరగతి కుటుంబాల వారిపై పెనుభారం పడుతుందని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపరచాలో తెలియక వైసీపీ ప్రభుత్వం ‘తుగ్లక్’ పనులతో ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ఏపీ సర్కార్ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు.
Go Back to Shorts
Kanna Lakshminarayana
BJP
Andhra Pradesh
YSRCP
current charges
hike

More Telugu News