'రొమాంటిక్' రిలీజ్ డేట్ ఖరారు
- ఆకాశ్ హీరోగా 'రొమాంటిక్'
- కథానాయికగా కేతిక శర్మ పరిచయం
- మే 29వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మే 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే ఈ పోస్టర్ వుంది. సునీల్ కాశ్యప్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. హీరోగా ఆకాశ్ కి హిట్ పడాలనే పట్టుదలతో .. నిర్మాతగా కూడా తనని ఈ సినిమా నిలబెడుతుందనే ఆశతో పూరి వున్నాడు.