అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్: నత్తనడకన సాగుతున్న భారత్ బ్యాటింగ్
- పోచెఫ్ స్ట్రూమ్ లో భారత్, బంగ్లాదేశ్ మధ్య టైటిల్ పోరు
- టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
- కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లా బౌలర్లు
- బంతులు తినేస్తున్న భారత బ్యాట్స్ మెన్
ధాటిగా ఆడతాడని పేరున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ 20 పరుగులు చేసేందుకు 43 బంతులు ఆడగా, మరో ఓపెనర్ 17 బంతులాడి కేవలం 2 పరుగులు చేసి అవుటయ్యాడు. భారత కుర్రాళ్ల జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేయగలిగింది. సెమీఫైనల్ మ్యాచ్ ను ఇదే మైదానంలో ఆడి ఎంతో దూకుడుగా ఆడిన భారత్ ఈసారి ఆచితూచి ఆడుతోంది.