Tapsee: కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకున్న తాప్సీ

షార్ట్స్‌లో చూడండి
సినీ నటి తాప్సీ ఢిల్లీలో ఇవాళ ఓటు హక్కు వినియోగించుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబయి నుంచి వచ్చిన తాప్సీ తన తల్లిదండ్రులు, సోదరి షాగున్ తో కలిసి ఓటేసిన అనంతరం ఫొటోలకు పోజులిచ్చింది. "మా కుటుంబం ఓటేసింది. మీరు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఢిల్లీ కోసం ఓటేయండి... ప్రతి ఓటు విలువైనదే" అంటూ ఆపై ట్వీట్ చేసింది. ఢిల్లీ ఎన్నికలను ఈసారి బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీతో హోరాహోరీ పోరు కొనసాగుతోంది.
Go Back to Shorts
Tapsee
Delhi
Elections
Polling
Family

More Telugu News