ఢిల్లీ అల్లర్లకు కేంద్ర బిందువైన షహీన్ బాగ్ ప్రాంతంలో.. పోలింగ్ బూత్ లకు పోటెత్తుతున్న ఓటర్లు
- గత రెండు నెలలుగా అట్టుడుకుతున్న షహీన్ బాగ్
- ఐదు పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ప్రకటించిన ఈసీ
- ఓటర్లలో వెల్లివిరుస్తున్న చైతన్యం
మరోవైపు, షహీన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఐదు పోలింగ్ స్టేషన్లను అత్యంత సున్నితమైనవిగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గంలో ఆప్ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, కాంగ్రెస్ తరపున పర్వేజ్ హష్మి, బీజేపీ తరపున బ్రహ్మ్ సింగ్ బిధూరి బరిలోకి దిగారు. సీఏఏ ఆందోళనల నేపథ్యంలో, ఈ నియోజకవర్గ ఓటర్లు ఎలాంటి తీర్పును వెలువరిస్తారో అని యావత్ దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.