JC Prabhakar Reddy: కుటుంబంలోని మహిళలను అడ్డంపెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నారు: 'జేసీ' బ్రదర్స్ పై వైసీపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

  • జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరున 84 బస్సులున్నాయని వెల్లడి
  • ఆ బస్సుల పత్రాలన్నీ నకిలీవేనని ఆరోపణలు
  • జేసీ సోదరుల వ్యాపారమంతా నకిలీ పత్రాలతోనే నడుస్తోందని వ్యాఖ్యలు
జేసీ సోదరులు కుటుంబంలోని మహిళలను అడ్డంపెట్టుకుని అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య ఉమాదేవి పేరు మీద 84 బస్సులు ఉన్నాయని, వాటికి సంబంధించిన పత్రాలన్నీ నకిలీవేనని ఆరోపించారు.

జేసీ దివాకర్ రెడ్డి సోదరుల రవాణా వ్యాపారమంతా ఫోర్జరీ సర్టిఫికెట్లతోనే నడుస్తోందని అన్నారు. కేతిరెడ్డి అనంతపురంలో మీడియా సమావేశం నిర్వహించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా తమను ఎవరూ ఏం చేయలేరని జేసీ సోదరులు అక్రమాలకు పాల్పడ్డారని, తాము వారి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఫోర్జరీ సర్టిఫికెట్లు ఇవేనంటూ కొన్ని నకళ్లను ఆయన మీడియాకు ప్రదర్శించారు.
JC Prabhakar Reddy
JC Diwakar Reddy
Ketireddy Peddareddy
YSRCP
Telugudesam

More Telugu News