Pawan Kalyan: ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన

షార్ట్స్‌లో చూడండి
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. సుగాలి ప్రీతి అత్యాచార ఘటనలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ 12న కర్నూలు నగరంలో ర్యాలీ చేపడతారని, 13న కర్నూలు, ఎమ్మిగనూరు నియోజక వర్గాల్లో పవన్ పర్యటిస్తారని తెలిపింది.

అందుకనే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదు: పవన్ కల్యాణ్

కర్నూలు ‘జనసేన’ కార్యకర్తలతో పవన్ ముఖాముఖి మాట్లాడారు. రాయలసీమలో పెట్టుబడులు పెట్టాలంటే అందరూ భయపడతారని అన్నారు. అక్కడ ఏదైనా పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే స్థానిక నాయకులు తమకు షేర్ కావాలని అడుగుతారని, అందుకే, పెట్టుబడిదారులు రావడం లేదని, అందుకనే రాయలసీమ అభివృద్ధి చెందడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో అసహనం పెరగడమే తప్ప తగ్గడం ఉండదని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Janasena
Kurnool
Emminganur

More Telugu News