సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో ఏపీలో చీకటి రోజులు: బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి
- ఇతర రాష్ట్రాలు పెట్టుబడులకోసం ప్రయత్నిస్తున్నాయి
- సీఎం జగన్ ఉన్న వాటిని పంపించేస్తున్నారు
- ఏపీ పరిస్థితి బీహార్ కంటే దారుణంగా మారింది
మొన్నటివరకు బీహార్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడేవారని, ఇప్పుడు ఏపీ అంతకంటే దారుణంగా తయారైందని బైరెడ్డి చెప్పారు. చంద్రబాబుపై కక్ష తీర్చుకుంటే చాలన్నట్లు వైసీపీ ప్రభుత్వ వైఖరి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కోతి చేష్టల వల్ల వనమంతా చెడిపోయిందన్నారు. జగన్ ఏపీకి సీఎంను అన్న విషయాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ ఒకసారి సమీక్షించాలని కోరనున్నట్లు ఆయన చెప్పారు.