అలాంటప్పుడు వారిని ఉరితీయాలనుకోవడం నేరపూరితమైన పాపం అవుతుంది: 'నిర్భయ' కేసులో కోర్టు వ్యాఖ్యలు
- ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన నిర్భయ దోషుల ఉరి
- మరో కొత్త తేదీ ప్రకటించాలని ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన తీహార్ జైలు అధికారులు
- పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం
దాంతో, నిర్భయ దోషులు నలుగురినీ ఉరితీసేందుకు కొత్త తేదీ ప్రకటించాలని తీహార్ జైలు అధికారులు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టును కోరారు. ఈ మేరకు దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వారు జీవించడానికి చట్టం అనుమతిస్తున్నప్పుడు, వారిని ఉరితీయాలనుకోవడం నేరపూరితమైన పాపం అవుతుంది అని పేర్కొంది. అంతేకాదు, తీహార్ జైలు అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.