బడి పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే రోజా.. 'మీరు గ్రేట్ మేడం' అంటోన్న నెటిజన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బడి పిల్లలకు స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే రోజా.. 'మీరు గ్రేట్ మేడం' అంటోన్న నెటిజన్లు

  • గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా బడికి వెళ్లిన రోజా
  • విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే
  • నగరిలోని ఓ పాఠశాలలో రోజా తనిఖీ
వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జగనన్న గోరుముద్ద కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. తన నియోజక వర్గం నగరిలోని ఓ పాఠశాలలో ఆమె పిల్లలకు పెడుతోన్న భోజనంలో నాణ్యతపై తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఆ తర్వాత వారితో కలిసి బంతిలో కూర్చొని భోజనం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యార్థులకు అందించే భోజన పథకానికి 'జగనన్న గోరుముద్ద'గా ఇటీవల పేరు పెట్టిన విషయం తెలిసిందే.

తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందని రోజా చెప్పారు. పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు భోజనం వడ్డించిన విషయానికి సంబంధించిన వీడియోను ఆమె తన ఫేస్‌బుక్, యూట్యూబ్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. 'మీరు గ్రేట్ మేడం' అంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Roja
YSRCP
Andhra Pradesh

More Telugu News