ఉరితీసిన తర్వాత అతడి శవాన్ని మాకు చూపించాలి... అదే మాకు పండుగ: శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలు
- హాజీపూర్ కిరాతకుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష
- వరుస హత్యల కేసులో ఫోక్సో న్యాయస్థానం తీర్పు
- హర్షం వ్యక్తం చేసిన బాధిత కుటుంబాలు
మరో మృతురాలు కల్పన తల్లి దీనిపై స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు కోసమే తాము పది నెలలుగా ఎదురుచూస్తున్నామని చెప్పారు. హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆ గ్రామానికే చెందిన కల్పన, శ్రావణి, మనీషాలపై అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడి అంతమొందించాడు. కల్పన కేసులో అతడికి జీవితఖైదు విధించగా, మనీషా, శ్రావణి కేసుల్లో పోలీసులు తిరుగులేని సాక్ష్యాధారాలు సమర్పించడంతో ఉరిశిక్ష పడింది.