జగిత్యాలలో కాల్పుల కలకలం.. ఒకరి పరిస్థితి విషమం
- భార్యపై శ్రీనివాస్ అనే వ్యక్తి కాల్పులు
- కుటుంబ కలహాలతో దారుణం
- అడ్డొచ్చిన మేనమామకు తీవ్రగాయాలు
మరో వ్యక్తితో కలిసి వచ్చిన శ్రీనివాస్ తన భార్యను హతమార్చబోయాడు. దీంతో మేనమామ రాజిరెడ్డికి బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ దర్యాప్తు ప్రారంభించి, శ్రీనివాస్‌కి ఆ తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అతడి వద్ద తుపాకీ, రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గీతికకు ఎటువంటి గాయాలూ కాలేదని తెలుస్తోంది.