కరోనా భయం...తీరంలో ప్రయాణికుల నౌకను నిలిపివేసిన జపాన్
- షిప్లో చిక్కుకున్న 3711 మంది
- 24 గంటలు ముగిసినా అనుమతించని అధికారులు
- ఒకరికి వైరస్ సోకిందని నిర్థారణ
జపాన్‌కు చెందిన ఈ క్రూయిజ్ షిప్ నిన్న యొకొహోమా తీరానికి చేరుకుంది. అయితే ప్రయాణికుల్లో కొందరు కరోనా బాధితులు ఉన్నారన్న వార్తతో వైద్యాధికారులు తీరంలో నిలిపి ఉంచిన నౌకలోకి వెళ్లారు. పరీక్షలు నిర్వహించగా హాంకాంగ్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధునికి వైరస్ సోకినట్లు నిర్థారించారు. దీంతో అధికారులు ప్రయాణికులు ఎవరూ నౌక నుంచి ఒడ్డుకు వచ్చేందుకు అనుమతించడం లేదు. ఇటీవల ఇదే నౌకను ఒకినోవా పోర్టు తీరంలోనూ ఆపేశారు. కరోనా విషయంలో జపాన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది.