Jagan: మోదీకి జగన్ ఇచ్చిన వినతుల కంటే కోర్టుకు ఇచ్చిన లేఖలే ఎక్కువ: అచ్చెన్నాయుడి ఎద్దేవా

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి పైసా విదల్చకపోవడంపై మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు స్పందించారు. బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరగడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే కారణమని ఆరోపించారు. తనకు 22 మంది ఎమ్మెల్యేలను ఇస్తే కేంద్ర మెడలు వంచుతానని జగన్ అన్నారని, ఇప్పుడు ఆయన మెడే సగానికి వంగిపోయిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీకి జగన్ ఇచ్చిన వినతుల కంటే కోర్టు వాయిదాలు ఎగ్గొట్టేందుకు రాసిన లేఖలే ఎక్కువన్నారు. రాజధానిపై ఐదు దేశాల ఎంబసీలు హెచ్చరించినా జగన్ పట్టించుకోవడం లేదన్నారు. జగన్ తన తుగ్లక్ చర్యలతో దేశవిదేశాల్లో ఏపీని నవ్వుల పాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
Go Back to Shorts
Jagan
Atchannaidu
Andhra Pradesh

More Telugu News