Nirbhaya: దోషులకు మరోసారి ఉరిశిక్ష వాయిదా పడడంతో కంటతడి పెట్టిన నిర్భయ తల్లి

  • ఉరి వాయిదా వేసిన పాటియాలా హౌస్ కోర్టు
  • దిగ్భ్రాంతికి గురైన నిర్భయ తల్లి ఆశాదేవి
  • నిర్భయ దోషులు అవహేళన చేస్తున్నారని ఆవేదన
  • నిర్భయ దోషుల లాయర్ పై ఆగ్రహం

నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న అమలు చేయాల్సిన ఉరిశిక్ష వాయిదాపడింది. డెత్ వారెంట్ పై స్టే ఇస్తూ పాటియాలా హౌస్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదాపడడంతో నిర్భయ తల్లి ఆశాదేవి దిగ్భ్రాంతికి గురయ్యారు. తీవ్ర భావోద్వేగాలకు లోనై కన్నీటిపర్యంతమయ్యారు.

తమను ఉరితీయలేరంటూ నిర్భయ దోషులు అవహేళన చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్ తమను సవాల్ చేస్తున్నాడని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం రేపిస్టులకు దన్నుగా నిలుస్తోందని ఆశాదేవి మండిపడ్డారు. నిర్భయ దోషులు మరోసారి తప్పించుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

More Telugu News