germany: జర్మనీలో గుంటూరు జిల్లా విద్యార్థి ఆత్మహత్య

షార్ట్స్‌లో చూడండి
ఎంఎస్ చదివేందుకు మూడేళ్ల క్రితం జర్మనీ వెళ్లిన గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థి మోహనరెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నాడు. ముప్పాళ్లకు చెందిన మోహనరెడ్డిది రైతు కుటుంబం. ఎంఎస్ చదువు నిమిత్తం 2017లో జర్మనీలోని డస్‌బర్గ్-ఈస్సెన్‌ వర్సిటీలో చేరాడు. మరికొన్ని రోజుల్లో కోర్సు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని పరీక్షల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. నాలుగు రోజుల క్రితం తండ్రి గోవిందరెడ్డికి ఫోన్ చేసిన మోహనరెడ్డి చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నానని, సరిగా చదవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి, మనస్తాపానికి గురైన విద్యార్థి బుధవారం తాను నివసిస్తున్న భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Go Back to Shorts
germany
Guntur District
Student

More Telugu News