సమత 'హత్యాచారం' దోషులకు ఉరిశిక్ష.. సంచలన తీర్పు వెల్లడించిన ప్రత్యేక కోర్టు
- గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లాలో హత్యాచారం
- బెలూన్లు అమ్ముకునే సమతపై దారుణం
- తుది తీర్పు వెల్లడించిన కోర్టు
గతేడాది నవంబర్ 24న కొమురంభీం జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్ శివారులో సమత అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకునే ఆమెపై ముగ్గురు మృగాళ్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. దారుణంగా హత్యాచారం చేయడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి.