అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది: డొక్కా మాణిక్య వరప్రసాద్

30-01-2020 Thu 10:51
  • నా వ్యక్తిగత ఆలోచనల మేరకే రాజీనామా చేశా
  • మండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరం
  • పలు విషయాల్లో పార్టీ ఆలోచన ఒకలా, నా ఆలోచన మరోలా వున్నాయి  

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్సీ పదవికి  టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ పలు విషయాలు తెలిపారు.

గాంధీజీ వర్ధంతి సందర్భంగా గుంటూరు హిమని సెంటర్‌లో ఆయన విగ్రహానికి నివాళులర్పించిన డొక్కా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... తన వ్యక్తిగత ఆలోచనల మేరకే రాజీనామా చేశానని అన్నారు. శానసమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని తెలిపారు.

ఇక పలు విషయాల్లో తమ పార్టీ ఆలోచన ఒకలా ఉందని, తన ఆలోచన మరోలా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తాను దూరంగా ఉండడమే మంచిదనిపించిందని వివరించారు. అందుకే తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.