BJP: అందుకే బీజేపీలో చేరాను: బ్యాడ్మింటన్ స్టార్‌ సైనా నెహ్వాల్

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 'బీజేపీలో చేరడం ఆనందంగా ఉంది. దేశం కోసం పని చేసే పార్టీలో చేరాను. దేశ అభివృద్ధి కోసం కష్టపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో పనిచేయాలని బీజేపీలో చేరాను. దేశంలో క్రీడాభివృద్ధికి మోదీ సర్కారు ఎంతో చేసింది. కష్టపడి సేవ చేయడానికి నా వంతు కృషి చేస్తాను' అని ఆమె తెలిపారు. ఆమెకు పలువురు బీజేపీ జాతీయ నేతలు అభినందనలు తెలిపారు.
BJP
New Delhi
Saina Nehwal

More Telugu News