విజయవాడలో బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ
- బీజేపీ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంత రెడ్డి హాజరు
- జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ హాజరు
- రాజధాని అంశంపై చర్చ
మరోవైపు, విజయవాడలోనే తమ పార్టీ కార్యాలయంలో నిన్న జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న సమావేశమై రాజధాని అంశంపై చర్చించారు. రాజధాని రైతుల తరఫున పోరాడతామని ఇప్పటికే బీజేపీ, జనసేన ప్రకటించాయి. ఈ రోజు భేటీలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జనసేన నేతలు పవన్ కల్యాణ్‌కు వివరించి, అనంతరం రాజధాని పోరాటంపై కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.