మరోసారి మహేశ్ బాబుకి జోడీగా కైరా అద్వాని
- యూత్ లో కైరా అద్వానీకి విపరీతమైన క్రేజ్
- గతంలో మహేశ్ తో చేసిన 'భరత్ అనే నేను'
- వంశీ పైడిపల్లికి సిఫార్స్ చేసిన నమ్రత
మహేశ్ బాబు - కైరా అద్వాని కాంబినేషన్లో ఇంతకుముందు 'భరత్ అనే నేను' వచ్చింది. కథాకథనాలపరంగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇక మహేశ్ బాబు - కైరా జోడీకి నూటికి నూరు మార్కులు పడిపోయాయి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిందని భావించిన నమ్రత, తాజా చిత్రానికి కైరాను తీసుకోమని వంశీ పైడిపల్లికి చెప్పిందట. అందువలన కైరా ఎంపిక దాదాపు ఖరారైనట్టుగానే చెప్పుకోవాలి.