వైఎస్ జగన్ లక్ష్యం ఇదొక్కటే: వర్ల రామయ్య

  • విపక్షంపై కక్ష సాధిస్తున్న సీఎం
  • ప్రజల గోడు కూడా వినడం లేదు
  • చాలా అన్యాయమన్న వర్ల రామయ్య
విపక్షంపై కక్ష సాధించడం ఒక్కటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టిన ఆయన, "ముఖ్యమంత్రి గారి శైలి కక్ష సాధింపు లక్ష్యంతో ఉన్నది. ఒక ప్రాంత ప్రజల గోడు వినడానికి కూడ ఇష్టపడడం లేదు. ఇది చాల అన్యాయం. చరిత్రలో మొగలాయిలు గాని, ఆంగ్లేయులు గాని అనుసరించని విధానాన్ని ముఖ్యమంత్రి గారు పాటిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి, రాజ్యాంగాన్ని తుంగలో త్రొక్కినారు" అని అన్నారు. ఈ ట్వీట్ పై మిశ్రమ స్పందన వెలువడుతోంది. 
Go Back to Shorts
Varla Ramaiah
YSRCP
Jagan
Twitter

More Telugu News