కశ్మీరీలు ఇంటర్నెట్ వాడేది అశ్లీల చిత్రాలు చూసేందుకే : నీతి అయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు

నీతి అయోగ్ సభ్యుడు, డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ వి.కె.సారస్వత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీరీలు ఇంటర్నెట్ ను వినియోగించేది బూతు సినిమాలు చూడడానికి తప్ప మరొకదానికి కాదని, ఈ పరిస్థితుల్లో నెట్ సేవలు నిలిపివేయడం వల్ల ఆర్థికంగా వచ్చే నష్టం ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్ విషయంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, వదంతులు వ్యాప్తి చెందకుండా చేయడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తప్ప మరొకటి కాదని స్పష్టం చేశారు. లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా అక్కడ కూడా ఢిల్లీ లాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే వారని ఆరోపించారు.

Go Back to Shorts
Jammu And Kashmir
vk sarswath
internet

More Telugu News