అతి పెద్ద టెలికం సంస్థగా అవతరించిన జియో!

  • 36.9 కోట్లకు జియో వినియోగదారులు
  • రెండో స్థానంలో వోడాఫోన్ ఐడియా
  • గత నవంబర్ లో తగ్గిన యూజర్లు
వినియోగదారుల సంఖ్య పరంగా ఇండియాలో అతి పెద్ద టెలికమ్ సంస్థగా రిలయన్స్‌ జియో అవతరించింది. ట్రాయ్‌ తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2019 నవంబర్ నాటికి జియో చందాదారుల సంఖ్య 36.9 కోట్లకు చేరుకుందని ట్రాయ్ తెలిపింది. జియో తరువాతి స్థానంలో 33.62 కోట్ల మంది సబ్ స్క్రయిబర్స్ తో వొడాఫోన్‌ ఐడియా, 32.73 కోట్ల వినియోగదారులతో ఎయిర్‌ టెల్‌ నిలిచాయి. అక్టోబర్ నాటికి దేశంలో టెలికం యూజర్ల సంఖ్య 120.48 కోట్లుండగా, నవంబర్‌ ముగిసేసరికి ఆ సంఖ్య 2.4 శాతం తగ్గి 117.58 కోట్లకు చేరుకున్నట్టు ట్రాయ్ పేర్కొంది.
Go Back to Shorts
Reliance
Jio
Telecom
TRAI

More Telugu News