అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రారంభమయ్యే తేదీలివే!

  • మార్చి 25-ఏప్రిల్ 2 మధ్య నిర్మాణ పనులు ప్రారంభం
  • ప్రజల నుంచి విరాళాల సేకరణ
  • నిర్మాణ కమిటీలో పలు సంస్థల ప్రతినిధులు
మార్చి 25వ తేదీ నుంచి ఏప్రిల్ రెండో తేదీ మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు మొదలుకానున్నట్టు తెలుస్తోంది. దశాబ్దాలపాటు కొనసాగిన అయోధ్య వివాదానికి ఇటీవలే తెరపడింది. ఆలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత వీలైనంత త్వరగా రామాలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. మందిర నిర్మాణ కమిటీలోని 11 మందిలో విశ్వహిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నట్టు సమాచారం.

ప్రజల భాగస్వామ్యంతో ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించిన కమిటీ.. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా ప్రారంభించాలని నిర్మాణ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం.
Go Back to Shorts
Anydhya
Lord Rama
temple

More Telugu News