Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • సమంతను ఉత్తమ నటి అంటోన్న హీరో 
  • 'డిస్కోరాజా'లో పాట పాడేసిన రవితేజ
  • పండగపూట షూటింగ్ పూర్తిచేసిన నాని

 *  'అందాల సమంత ఉత్తమ నటి' అంటున్నాడు హీరో శర్వానంద్. 'సమంత చాలా ప్రతిభావంతురాలైన నటి. ఇంకా చెప్పాలంటే, నేటి తరం హీరోయిన్లలో సమంత  ఉత్తమనటి' అంటూ శర్వానంద్ ప్రశంసలు కురిపించాడు. వీరిద్దరూ కలసి తాజాగా 'జాను' చిత్రంలో నటించారు.
*  రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న 'డిస్కో రాజా' చిత్రాన్ని ఈ నెల 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఇందులో రవితేజ ఓ మాసీ సాంగ్ పాడినట్టు తాజా సమాచారం. ఇందులో నభా నటేష్, తాన్యా హోప్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించారు.
*  నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'వి' చిత్రం షూటింగ్ నిన్నటితో మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని తెలుపుతూ, సంక్రాంతి రోజున షూటింగ్ పూర్తిచేశామని నాని పేర్కొన్నాడు.

More Telugu News