టిక్‌టాక్‌లో యువతి వీడియో.. అసభ్య కామెంట్ చేసిన మరో యువతి.. పోలీస్ కేసు!

  • హైదరాబాద్, ఎస్సార్ నగర్‌లో ఘటన
  • టిక్‌టాక్‌లో అక్కాతమ్ముళ్ల సరదా వీడియో
  • వేధింపు కాల్స్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు
అక్కాతమ్ముళ్లు కలిసి వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌‌లో సరదాగా చేసిన వీడియో వారిని అవమానాల పాలు చేసింది. హైదరాబాద్, ఎస్సార్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. బల్కంపేటకు చెందిన అక్క, తమ్ముడు కలిసి టిక్‌టాక్‌లో ఓ వీడియో చేశారు. ఆ వీడియోను చూసిన మరో యువతి.. ఆ వీడియోలో ఉన్నది అక్కాతమ్ముళ్లు కాదని, ఆమె ఓ వ్యభిచారని టిక్‌టాక్‌లో కామెంట్ చేసింది. అంతేకాక, ఆమె ఫోన్ నంబరును వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసింది. దీంతో ఆమెకు వేధింపు కాల్స్ వచ్చాయి. అవి ఆగకపోవడంతో  బాధిత అక్కా, తమ్ముడు నిన్న సాయంత్రం ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Tiktok
Police

More Telugu News