జనసేన ఒంటరి ప్రయాణం కన్నా విలీనమే మేలు: బీజేపీ నేత భానుప్రకాశ్

ఏపీలో బీజేపీ, జనసేన పార్టీలు అంశాలవారీగా కలిసి పనిచేస్తాయన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. పొత్తుపై తమకు ఎలాంటి సమాచారం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేయగా, జనసేన ఒంటరి ప్రయాణం కంటే విలీనమైతేనే మేలు అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాశ్ అంటున్నారు.

 బీజేపీలో జనసేన విలీనం కావాలనే తాము కోరుతున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 16న జరిగే సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నా స్వాగతిస్తామని అన్నారు. ప్రస్తుతం ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని, అక్రమ కేసులతో పోలీసు రాజ్యం నడుస్తోందని అన్నారు. ఇలాంటి పాలనను ఎదుర్కోవడానికి ఇతర పార్టీలు బీజేపీ అండను కోరుకుంటున్నాయని భానుప్రకాశ్ వివరించారు.
Go Back to Shorts
Andhra Pradesh
BJP
Pawan Kalyan
Jana Sena
Bhanuprakash
Kanna Lakshminarayana

More Telugu News