హైదరాబాదులో ఆకట్టుకున్న శారీ రన్
- చీరకట్టుతో పరుగులో పాల్గొన్న మహిళలు, బాలికలు
- పరుగును ప్రారంభించిన నటుడు మిలింద్ సోమన్
- మహిళల్లో ఫిట్ నెస్ పెంచడానికే కార్యక్రమమన్న నటుడు
ర్యాలీలో భాగంగా జుంబా సెషన్, కర్రసాము, వ్యాయామం చేస్తూ మహిళలు ముందుకు సాగారు. చీరకట్టుతో శారీ రన్ లో పాల్గొనటం తమకు ఆనందాన్ని కలిగించిందని మహిళలు వెల్లడించారు. మహిళలు ర్యాలీ సందర్భంగా డోంట్ హోల్డ్ బ్యాక్ అన్న నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా నటుడు మిలింద్ సోమన్ మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో ఆరోగ్యాన్ని, శారీరక పటుత్వాన్ని పెంచడానికే ఈ రన్ ను చేపట్టామన్నారు. భారతీయ మహిళకు చీరతో విడదీయరాని సంబంధముందన్నారు.