గత ఏడాది మార్చి 22న చివరిసారిగా కోర్టుకు హాజరైన జగన్
- నెలల తరబడి విచారణకు హాజరుకాకపోవడంతో సీబీఐ కోర్టు అసహనం
- తప్పకుండా హాజరుకావాలని ఆదేశించిన న్యాయస్థానం
- సీఎం అయిన తర్వాత తొలిసారి సీబీఐ కోర్టుకు వచ్చిన జగన్
గత ఏడాది మార్చి 22న చివరిసారిగా కోర్టు విచారణకు జగన్ హాజరయ్యారు. అదే సమయంలో ఎన్నికలు రావడం, ఆ తర్వాత సీఎం కావడంతో... జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ వచ్చారు. అయితే, నెలల తరబడి విచారణకు హాజరు కాకపోతుండటంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరుకావాలని జగన్, విజయసాయిరెడ్డిలను ఆదేశించింది. హాజరుకాకపోతే తగు ఉత్తర్వులను జారీ చేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, వీరిద్దరూ ఈరోజు విచారణకు హాజరయ్యారు.