స్వరాష్ట్రం చేరుకున్న మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలిపిన సుజనాచౌదరి
- 2018 నవంబరులో పాక్ జలాలలో అరెస్ట్
- పాక్ చెర నుంచి విడుదలైన మత్స్యకారులు
- మోదీకి, సుబ్రహ్మణ్యం జైశంకర్ కి ధన్యవాదాలు
కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్యకారులు గుజరాత్ లోని వీరావల్ లోని చేపల వ్యాపారుల వద్ద పని చేస్తుంటారు. చేపల వేటలో భాగంగా 2018 నవంబరులో వీరావల్ తీరం నుంచి సముద్రంలోకి వెళ్లిన వీరు పొరపాటున పాక్ సముద్ర జలాల్లోకి ప్రవేశించారు. దీంతో, ఆ దేశ భద్రతా సిబ్బంది వీరిని అదుపులోకి తీసుకుంది.