Delhi: ఢిల్లీలో అభివృద్ధి ఇంతటితో ఆగకూడదనుకుంటే మాకే ఓటెయ్యండి: సీఎం కేజ్రీవాల్

షార్ట్స్‌లో చూడండి
వచ్చే నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడ్డ కొంచెం సేపటి తర్వాత ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్పందించారు. గత డెబ్బై ఏళ్లలో ఎన్నడూ లేనంత అభివృద్ధిని తమ పాలనలో చేసి చూపించామని, ఢిల్లీని ఎంతో అభివృద్ధి చేశామని అన్నారు.

ఢిల్లీని తమ పార్టీ బాగుచేసిందని భావించినా, ఈ అభివృద్ధి ఇంతటితో ఆగిపోకూడదనుకున్నా ప్రజలతో పాటు బీజేపీ సానుభూతిపరులు సైతం తమ పార్టీకే ఓటెయ్యాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై విమర్శలతో పాటు ఆయనకు ఓ సూచన కూడా చేశారు.

తాము కేవలం అభివృద్ధి గురించిన అంశాలపైనే మాట్లాడతాము కానీ, అమిత్ షా మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తారని విమర్శించారు. ఢిల్లీ అభివృద్ధికి పనికొచ్చే అంశాలు ఏమైనా ఉంటే అమిత్ షా సూచించాలని, వాటిని తమ మేనిఫెస్టోలో ఉంచుతామని సూచించారు.
Go Back to Shorts
Delhi
Assembly Elections
cm
Kejriwal
AAP

More Telugu News