పెళ్లి చేసుకోవాలంటూ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు వేధింపులు.. జైలుకెళ్లినా మారని బుద్ధి!
- గతంలో యువతిని వేధించినందుకు జైలుకు
- తాజాగా కంపెనీ వద్దకు వెళ్లి మరీ వేధింపులు
- కేసు నమోదు చేసిన పోలీసులు
అతడి వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న తిరుమలగిరి పోలీసులు అతడిని జైలుకు పంపారు. కాగా, ఇటీవల ఆమె మాదాపూర్‌లోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరింది. జైలు నుంచి విడుదలైన అఖిల్ శనివారం సాయంత్రం మాదాపూర్‌లో యువతి పనిచేస్తున్న కంపెనీ వద్దకు వచ్చి మరోమారు ఆమెను వేధించాడు. దీంతో బాధిత యువతి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.